Templates by BIGtheme NET
Home >> Telugu News >> 6 గంటల్లో 6 లక్షల కోట్లు హాంఫట్

6 గంటల్లో 6 లక్షల కోట్లు హాంఫట్


షేర్ మార్కెట్ మాయాజాలం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది తాజా రుజువు. కేవలం ఆరు గంటల వ్యవధిలో ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అది కేవలం ఒక సంస్థకు సంబంధించిన మొత్తం కావడం గమనార్హం. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా షేర్లు బుధవారం న్యూయార్క్ ట్రేడింగ్లో భారీ నష్టం చవిచూశాయి. ఎస్ అండ్ పీ 500 జాబితాలో టెస్లాకు చోటు దక్కకపోవడమే ఈ దారుణ నష్టాలకు కారణం. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్ల విలువ 21 శాతం పడిపోయింది. దీంతో టెస్లా కంపెనీకి ఏకంగా 82 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో 6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది.

సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ఆస్తికి కూడా పెద్ద మొత్తంలో కోత పడింది. ఆ మొత్తం 16.3 బిలియన్ డాలర్లు. అంటే రూపాయల్లో లక్షా 17 వేల కోట్లన్నమాట. ప్రస్తుతం ఆయన ఆస్తి 82.3 డాలర్లు. టెస్లా ఆదాయం ఇలా అనూహ్యంగా పడిపోవడం ఇది తొలిసారేమీ కాదు. ఇంతకుముందు మస్క్ చేసిన ఒక ట్వీట్ కారణంగా లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.గత ఏడాది మే 1న ఎలన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ తో.. ఆయన కార్ల కంపెనీ విలువ 1400 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1.05 లక్షలు) ఆవిరైపోయింది. కంపెనీ షేర్ల ధర చాలా ఎక్కువగా ఉందని ఆయన తన ట్వీట్లో వ్యాఖ్యానించటమే దీనికి కారణం. ఇన్వెస్టర్లు వెంటనే కంపెనీ నుంచి తప్పుకోవటంతో.. మస్క్ కంపెనీలోని తన సొంత వాటాలో కూడా 300 కోట్ల డాలర్లు పోగొట్టుకున్నారు.