బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు

0

ఒకరు చేస్తే రేప్.. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే సామూహిక అత్యాచారం.. అంతకుమించి మంది చేస్తే.. అదో పెద్ద ఘోరమే.. అవును.. ఏకంగా తనపై 139మంది రేప్ చేశారని.. లెక్కబెట్టుకొని మరీ వారి పేర్లతో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఈ మేరకు పోలీసులు ఆ 139 మందిపై ఏకంగా నిర్భయ కేసు పెట్టడం సంచలనమైంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తాజాగా సంచలన కేసు నమోదైంది.నిండా 25 ఏళ్లు కూడా లేని ఓ యువతి తనను 139మంది రేప్ చేశారని కేసు పెట్టింది.113 పేజీల సుధీర్ఘ ఫిర్యాదు లేఖను రాసిన యువతి.. అందులో రాజకీయ నాయకుల పీఏలు.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా చేర్చినట్టు మీడియా వార్తల ద్వారా తెలిసింది.

మిర్యాలగూడకు చెందిన ఈ 25 ఏళ్ల యువతి తనపై 139మంది అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కూడా ఈ 139మందిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

గతంలో ఆ యువతికి పరిచయం ఉన్న అందరిపై ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడీ కేసులో ప్రముఖులు ఉండడంతో సంచలనంగా మారింది. ఇంతమంది నిజంగానే రేప్ చేశారా? లేక ఈ ఇష్యూ వెనుక ఏమైనా ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.