అన్ లాక్-4: ఇవీ ఓపెన్.. గైడ్ లైన్స్ ఇవీ

0

సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 దేశంలో అమలు కాబోతోంది. ఈ క్రమంలోనే శనివారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది.

దేశంలో దశలవారీ పద్ధతిలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. ఇక స్టెపెంబర్ 30 వరకు స్కూళ్లు కాలేజీలు కోచింగ్ సెంటర్లు మాల్స్ మూసే ఉంటాయని కేంద్రం తెలిపింది.

ఇక అన్నింటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. 21 నుంచి క్రీడలు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలకు కూడా అనుమతిచ్చింది. సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ 100 మందికే హాజరు కండీషన్ పెట్టింది.

ఇక అంతర్రాష్ట్ర రవాణాకు సైతం అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఇక 65 ఏళ్లు పైబడిన వారు.. ఆరోగ్యసమస్యలున్న వారు.. గర్భిణులు 10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించింది.