కాస్టింగ్ కౌచ్ పై యాంకర్ అనసూయ కామెంట్స్…!

0

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా హవా చూపిస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా అందరిని మెప్పించింది. ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ ‘మీటూ’లపై స్పందించింది.

అనసూయ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో మీటూ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండొచ్చు. కానీ అది అమ్మాయి మీదే డిపెండై ఉంటుంది. ఆఫర్ ఇస్తానని ఎవరైనా ఏదైనా అడిగితే.. ఈ ఆఫర్ రావాలంటే ఇతను ఇలా అడుగుతున్నాడు.. ఇది కాకపోతే మరొకటి వస్తుందని డ్రాప్ కావచ్చు. అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ కాస్టింగ్ కౌచ్ కి బలైపోతున్నారు. మీ టాలెంట్ ని మీరు నమ్ముకోండి. బయట కాంపిటేషన్ లేదని చెప్పడం లేదు. నేను చేసే క్యారెక్టర్స్ నా కంటే బాగా చేసే మరో పది మంది ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి” అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ”నేను కూడా ఫేవరిజానికి బలై చాలా ఛాన్సెస్ మిస్ అయ్యాను. కానీ ఎప్పుడూ బయటకు చెప్పి రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా. ఓ గ్రూప్ ఫేవరిజం వల్ల రెండేళ్ల క్రితం నేను కొన్ని అవకాశాలు కోల్పోయాను. అయినా నన్ను నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. ఈ క్యారెక్టర్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్ లో అదే టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్ కాదు కదా.. కాస్టింగ్ పిల్లో కూడా నీ దగ్గరకు రాదు” అని అనసూయ పేర్కొన్నారు.