ఐఎండీబీలో 1.1 రేటింగ్.. హవ్వ! అంత చెత్త మూవీనా?

0

అంతర్జాతీయంగా ఐఎండీబీ ఎంత పాపులరో చెప్పాల్సిన పనే లేదు. ఐఎండీబీ అనేది సినిమాల రివ్యూల పరంగా ప్రామాణికత ఉన్న రేటింగ్ సంస్థ. అయితే ఐఎండీబీలో అత్యంత వరస్ట్ సినిమా ఏది? అంటే.. బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ సడక్ 2 అని తేలింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి ఐఎండీబీ వెబ్ సైట్ మరీ దారుణంగా 1.1 రేటింగ్ ఇవ్వడం చూస్తుంటే సినిమా అంత చెత్తగా ఉందా? అన్నది రూఢీ అయిపోతోంది.

దాదాపు వెయ్యి ఓట్లను గణించి ఐఎండీబీ ఈ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి IMDB లో అత్యంత దారుణమైన చెత్త రేటింగ్ పొందిన సినిమా ఏది? అంటే సడక్ 2 అని ఠకీమని చెప్పేస్తున్నారు. కె.వో.జడ్ అనే 2015 టర్కిష్ చిత్రం 1.3 రేటింగ్ కలిగి ఉంది. అంతకుమించి సడక్ 2 రేటింగ్ దిగజారిపోవడం ప్రస్తుతం భట్స్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 10/1 అంటే పదికి ఒక్క మార్కు అంటే మరీ ఘోరం అనే దీనర్థం.

నటవారసురాలు ఆలియాభట్ ప్రధాన పాత్రలో మహేష్ భట్ రూపొందించిన ఈ సినిమాపై సుశాంత్ సింగ్ అభిమానులు తొలి నుంచి నెగెటివ్ ప్రచారమే చేస్తున్నారు. యూట్యూబ్ లో ట్రైటర్ కి డిస్ లైక్ ల పరంగా వరల్డ్ రికార్డే కట్టబెట్టారు. ఇక ఐఎండీబీనే కాదు జాతీయ మీడియా ఈ సినిమాని పరమ చెత్త అంటూ సమీక్షించడం తో ఆలియాకు ఓ డిజాస్టర్ తగిలిందని ఖాయమైంది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది కాబట్టి .. అక్కడ వీక్షణలు ఎలా ఉంటాయో చూడాలి. అలియా భట్ – సంజయ్ దత్ – ఆదిత్య రాయ్ కపూర్ ఈ చిత్రంలో నటించారు.