బిడ్డ బయటికి రావడం లేటవుతోందట.. సామ్ వ్వాటే పంచ్

0

బాలీవుడ్ లో వరుసగా ఫ్రెగ్నెన్సీ వార్తలు హీటెక్కిస్తున్నాయి. బెబో కరీనా కపూర్ అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించేయగా.. అనుష్క శర్మ సైతం జూనియర్ విరాట్ భూమ్మీదకు రావడానికి సమయమాసన్నమైందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా కెప్టెన్ వారసుడి గురించి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫోటోని కూడా షేర్ చేసింది అనుష్క.

అదంతా సరే కానీ.. గత రెండేళ్లుగా అనుష్క శర్మకు పిల్లలు ఎప్పుడు? అన్న ప్రశ్న ఎదురవుతూనే ఉంది. పెళ్లయి చాలాకాలమే అయ్యింది కదా.. వారసుడు బరిలో దిగేదెపుడు? అంటూ పదే పదే ప్రశ్న ఎదురయ్యేది. ఇక దానికి చెక్ పడిపోయింది. అదంతా సరే కానీ.. అన్నిట్లో అనుష్క శర్మనే అనుసరించే అక్కినేని కోడలు సమంత గర్భవతి అయ్యేదెపుడు? ఇప్పుడిదే చిక్కు ప్రశ్నను ఎదుర్కొంది సామ్.

2017 లో నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పటి నుండి సామ్ పై ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. సామ్ గర్భధారణ గురించి రకరకాల పుకార్లు ఎప్పుడూ షికారు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నకు ఇంకా సామ్ నుంచి సరైన సమాధానం లేదు. 30లో ఎలానూ పిల్లల్ని కంటాను.. ! అంటూ చెప్పుకొచ్చిన సామ్ ఎందుకని ఆలస్యం చేస్తోంది? అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది. ఇన్ స్టాలో ఆస్క్ సమంత సెషన్స్ లో 33 ఏళ్ల సమంతకు మరోసారి ఆ ప్రశ్న ఎదురవ్వడంతో కాస్త వ్యంగ్యంగానే స్పందించింది ఎందుకనో!

“నేను 2017 నుండి గర్భవతినే.. ఈ బిడ్డ బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటోంది“ అంటూ పంచ్ వేసింది. అయితే కోపంగానో వ్యంగ్యంగానో మొత్తానికి సమాదానం వచ్చినందుకు.. ఆ ప్రశ్నను అడిగేసిన అతగాడు మాత్రం సైలెంట్ అయిపోయాడు..