హీరోయిన్ అవ్వకుండానే మిలియన్ మార్క్ చేరింది

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గత కొన్నాళ్లుగా బ్రౌన్ కలర్ గర్ల్ అంటూ పిలవబడుతుంది. ఆమెను సోషల్ మీడియాకు దూరంగా ఉంటే బాగుంటుందని కొందరు.. మీ నాన్న పరువు తీయకుండా ఉండాలంటే మీరు సోషల్ మీడియాలో మీ ఫొటోలు పెట్టవద్దంటూ మరి కొందరు ఆమెను ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. అవన్ని పట్టించుకోకుండా ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయిన సుహానా రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొందరు విమర్శలు చేసే వారు ఉన్నా ఎక్కువ మంది ఆమె ఫొటోలను ఇష్టపడే వారు.. ఆమె షేర్ చేసే వీడియోలను ఆస్వాదించే వారు ఎక్కువగా ఉన్నారు.

హీరోయిన్ గా సుహానా పరిచయం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా నటించేందుకు సుహానా రెడీ అవుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈమె నటిగా పరిచయం అవ్వాల్సి ఉన్నా కూడా నెపొటిజం గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతున్న కారణంగా ఈమె ఎంట్రీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం అయితే కన్ఫర్మ్ అంటున్నారు. అది ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. హీరోయిన్ గా ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండానే సుహానా ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుంది.

ఇండస్ట్రీలో ఉన్న వారు సైతం కొందరు ఇంత మంది ఫాలోవర్స్ ను దక్కించుకోవాలంటే కిందా మీదా పడుతారు. అలాంటిది ఈమె ఒక్క సినిమా చేయకుండానే మిలియన్ మార్క్ చేరుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఆమెకు తండ్రి సపోర్ట్ ఉండటం వల్ల ఇంత మంది ఫాలోవర్స్ వచ్చి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. కాని ఆమె పోస్ట్ లు రెగ్యులర్ గా పెడుతూ అందరిని ఆకట్టుకోవడం వల్లే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.