15 మిలియన్ల మందికి అందుకే కాజల్ ఆరాధ్య దేవత

0

అందాల చందమామ గురించి పరిచయం అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ఓన్ చేసుకుని మురిసిపోయే మన పక్కింటి అమ్మాయిగా స్థిరపడిపోయింది. ఫ్యాన్ ఫాయియింగ్ లో ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. `లక్ష్మీ కల్యాణం`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలంపైనే కావస్తున్నా కాజల్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. లాక్ డౌన్ కి ముందు అందమైన దీవుల్లో విహరించి సన్ బాత్ని ఎంజాయ్ చేస్తూ జోరుగా కనిపించింది.

ఇన్స్టా లో కాజల్ మిగతా హీరోయిన్ లతో పోలిస్తే అంతగా యాక్టివ్ గా లేకపోయినా అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం సొంతం చేసుకుంది. 15 మిలియన్ ల మంది అమెని ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారంటే ఈ అందాల చందమామ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కోట్లాది హృదయాల్ని కొల్లగొట్టిన ఈ ముంబై చిన్నది ప్రస్తుతం వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది.

చిరుతో `ఆచార్య`… మంచు విష్ణుతో `మోసగాళ్లు`.. కమల్ దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ ల కలయికలో వస్తున్న `ఇండియన్ 2` చిత్రాలతో పాటు ముంబై సాగ.. హే సినామిక చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో కాజల్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్గా మారాయి. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా గడిపేస్తున్న కాజల్ నెక్ట్స్ ఏంటనే ఆలోచనలో పడిపోయిందా అంటూ ఫ్యాన్స్ కామెంట్ లు విసురుతున్నారు.