పోకిరి గాళ్ ఏమిటీ నాభి విన్యాసం?

0

`పోకిరి` ఫేం శివ రాణా గుర్తుందా? ఓవైపు మాఫియా ఎటాక్ లో ఏ ప్రాణం ఎటు పోతుందోనని రౌడీలంతా టెన్షన్ పడుతుంటే `నువ్వు నాకు బాగా నచ్చావ్ రా!` అంటూ మహేష్ వెంట పడుతుంది. అంత టెన్షన్ లోనూ శివ రాణా ఒక పెద్ద రిలీఫ్ థియేటర్లలో ఆడియెన్ కి. పోకిరి చూశాక మహేష్ ని గుర్తు పెట్టుకున్నట్టే శివ రాణాని సౌత్ ఆడియెన్ అంతా గుర్తు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి ఆవిడ ఇమేజ్ ని.

పక్కా లేడీ గ్యాంగ్ స్టర్ గా శివ రానా అభినయం అంత బాగా వర్కవుటైంది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు చిత్రాల్లో ఆ తరహా పాత్రల్నే ట్రై చేసింది. పూరి డిస్కవరీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అన్నట్టు శివ రాణా ఇతర కొలీగ్స్ లానే సోషల్ మీడియాలో యమ స్పీడ్ గా ఉంటోంది.

తాజాగా ఓ స్పెషల్ యోగా వీడియోని శివ్ రాణా షేర్ చేసింది. ఇదో వెరైటీ యోగం. నాభి కేంద్రాన్ని ఎలివేట్ చేస్తూ ఉదరభాగాన్ని లోనికి లాగడం ద్వారా ప్రత్యేకమైన యోగా చేస్తోందిలా. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. “జీవితం డిమ్ కాకుండా ఉండాలంటే యోగా అనే లైట్ అవసరం. ప్రాక్టీస్ చేయడం మంచిది. మీలో అగ్ని మరింత తేజోవంతం అవుతుంది“ అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది శివ రాణా.

Yoga is a light, which once lit will never dim. The better your practice, the brighter your flame. 🧘🏻‍♀️ good morning 🙏🏼🌸 . . . . #kriya #yoga

null