18 పేజెస్` నింపడం మొదలుపెట్టారు!

0

విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటున్న క్రేజీ హీరో నిఖిల్. `అర్జున్ సురవరం` చిత్రంతో హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్న నిఖిల్ రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాల్ని లైన్ లో పెట్టాడు. నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్`. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి కథ స్క్రీర్ ప్లే తో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

`కుమారి 21 ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అపుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ప్లే అందిస్తుండటంతో ఈ మూవీపై ప్రత్యేక దృష్టి ఏప్పడింది.

ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న 18 పేజీస్ టీమ్. ఈ సినిమాను అతి త్వరగా కంప్లీట్ చేసి `కార్తికేయ 2`లో జాయిన్ అవ్వాలని హీరో నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే `18 పేజెస్`ని త్వరగా పూర్తి చేయాలని స్పీడు పెంచినట్టు తెలిసింది.