ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏది చేసినా సంచలనమే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి వుందని ఆకారణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం సృష్టించాయి.

ఇదిలా వుంటే కంగన ఇంట పెళ్లి సందడి మొదలైంది. కంగన సోదరి రంగోలి చండేల్ వివాహం తరువాత మళ్లీ ఆ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. అయితే కంగన కోసం కాదండోయ్.. కంగన బ్రదర్స్ కోసం. కంగన సోదరులు అక్షిత్ అండ్ కరణ్ ల ప్రీ వెడ్డింగ్ హంగామా ఈ రోజు మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా కంగన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

రంగోలి వివాహం జరిగి ఒక దశాబ్దానికి పైగా అవుతోంది. అప్పటి నుంచి కుటుంబంలో నాకు వివాహం జరగలేదు. ఎలాంటి శుభకార్యం జరగలేదు. ఇన్నేళ్ల తరువాత మా ఇంట్లో ఈ రోజు నా సోదరులు కరణ్ అక్షత్ వివాహం జరుగుతోంది. మా పూర్వీకుల ఇల్లు వివాహ ఉత్సవాల్లో మునిగిపోయింది. మూడు వారాల్లో రెండు వివాహాలు ఈ రోజు కరణ్ కి హల్దితో పెల్లి వేడుకలు మొదలయ్యాయి` అని ట్వీట్ చేసింది.