Templates by BIGtheme NET
Home >> Cinema News >> పబ్లిక్ లో ఇదేంటంటూ హీరోయిన్ పై సామాజిక కార్యకర్తల దాడికి యత్నం

పబ్లిక్ లో ఇదేంటంటూ హీరోయిన్ పై సామాజిక కార్యకర్తల దాడికి యత్నం


కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కొందరు సామాజిక కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది. శుక్రవారం సాయంత్రం సమయంలో తన స్నేహితురాలితో కలిసి సంయుక్త బెంగళూరులోని ఒక పబ్లిక్ పార్క్ లో వర్కౌట్స్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టింది. రెగ్యులర్ గా ఆమె ఇలా చేస్తుండటంతో కొందరు ఈ విషయంలో ఫిర్యాదు ఇవ్వడంతో సామాజిక కార్యకర్తలం అంటూ పది మంది యువకులు అక్కడకు వెళ్లి పబ్లిక్ పార్క్ లో ఇదేం పని అంటూ ఆమెను మందలించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సంయుక్త ను దాడి నుండి కాపాడారు. సామాజిక కార్యకర్తలు తనపై దురుసుగా ప్రవర్తించిన వీడియోను లైన్ ద్వారా అందరికి సంయుక్త చూపించింది. తాను స్పోర్ట్స్ బ్రా ధరించినందుకు వారు దాడికి పాల్పడుతున్నారని ఇదేనా ఇండియాలో ఉన్న స్వాతంత్ర్యం అంటూ ప్రశ్నించింది. పోలీసులు సామాజిక కార్యకర్తలతో పాటు సంయుక్తను కూడా స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అక్కడ కూడా సోషల్ మీడియా లైవ్ ను సంయుక్త ఇచ్చింది. ఆ సమయంలో స్టేషన్ ఇన్సిపెక్టర్ ఆమె లైవ్ ను బలవంతంగా నిలిపేయించాడు.

హిందుత్వంకు వ్యతిరేకంగా ఆమె చేస్తుందంటూ సామాజిక కార్యకర్తలు నినాదాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ పాలన ఉండటంతో ఇలాంటివి జరుగుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిలు పబ్లిక్ ప్లేస్ ల్లో స్పోర్ట్స్ బ్రా ల్లో వర్కౌట్స్ చేయ కూడదు అనేది ఆ సామాజిక కార్యకర్తల డిమాండ్ గా తెలుస్తోంది. అందుకే సంయుక్తపై దాడికి ప్రయత్నించారంటూ సమాచారం అందుతోంది. ఈ విషయమై పూర్తి వివరాలు బెంగళూరు పోలీసులు నేడు తెలియజేసే అవకాశం ఉంది.