చేతిలో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్.. మిల్కీ బ్యూటీ రిచ్ లుక్

0

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్న కూడా ఇంకా పదుల సంఖ్యలో ఆఫర్లు అందుకుంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఇండస్ట్రీలో నిలదోకుక్కుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో తమన్నా భాటియా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా బిజీగా మారాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే చాలా రోజుల తర్వాత ఆమె ఒక డిఫరెంట్ లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టు చేసింది. బబ్లీ కౌన్సర్ అనే ఆ సినిమా త్వరలోనే హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా తమన్న బాలీవుడ్ లో కూడా చాలా రిచ్ గానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. సాధారణంగా హీరోయిన్లు ఎక్కడికి వెళ్లిన గ్లామర్ డ్రెస్సులతో లేదా ఖరీదైన వస్తువులను చేతిలో పట్టుకొని కనిపిస్తూ ఉంటారు.

ఇక ముందుగా గ్లామర్ అందాలతో ఆకట్టుకున్న తమన్నా ఇప్పుడు ఒక ఖరీదైన బ్యాగుతో బాలీవుడ్ మీడియాను ఆకర్షించింది. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన అమ్మడు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంది. ఇక తన చేతిలో ఒక బ్యాగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ బెర్రీ అనే ఖరీదైన బ్యాగు విలువ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆమె చేతిలో ఉన్న బ్యాంక్ ధర అక్షరాల రూ.90 వేలు ఉంటుంది అని తెలుస్తోంది. ఏదేమైనా తమన్నా తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కాకుండా తన హ్యాండ్ బ్యాగ్ తో కూడా ఒక్కసారిగా కెమెరాలను తనవైపు తిప్పుకునేలా చేసింది. తమన్న ఇంతకుముందు కూడా చాలా ఖరీదైన వస్తువులతో ఈ విధంగా కనిపించింది. ఇక బబ్లీ బౌన్సర్ సినిమా విషయానికి వస్తే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్న ఒక లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 23న హాట్ స్టార్ లో విడుదలవుతోంది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.