Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ అతడిని కూడా కాపాడలేక పోయాడు!

బిగ్ బాస్ అతడిని కూడా కాపాడలేక పోయాడు!


వీజే సన్నీ బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు బాగానే చేరువ అయ్యాడు. తన యొక్క ప్రవర్తనతో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే మంచి పేరును దక్కించుకున్నాడు. బిగ్ బాస్ లో ఏకంగా విజేతగా నిలిచిన సన్నీకి ఎదురు లేదని కొందరు భావించారు. కానీ అనూహ్యంగా గతంలో బిగ్ బాస్ విన్నర్ లకు ఎదురైన పరిస్థితి ఇప్పుడు వీజే సన్నీకి కూడా తప్పలేదు పాపం.

బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన వీజే సన్నీ వరుసగా సినిమాల్లో నటించాలని ఆశ పడ్డాడు. అందులో భాగంగానే ఆయన నటించిన ‘సకల గుణాభి రామ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సన్నీ గతంలోనే నటించినా కూడా తాజాగా బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశ్యంతో నిన్న విడుదల చేయడం జరిగింది.

సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. పెద్దగా బజ్ లేకుండానే విడుదల అయిన ఈ సినిమాను గురించి విడుదల తర్వాత జనాలు మాట్లాడుకుంటారని యూనిట్ సభ్యులు భావించారు. కానీ విడుదల తర్వాత కూడా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

బిగ్ బాస్ వల్ల ప్రేక్షకులకు చేరువైన వీజే సన్నీ హీరోగా మాత్రం సక్సెస్ అవ్వలేక పోయాడు. బిగ్ బాస్ ఇమేజ్ తో సినిమాకు జనాలు వస్తారు.. సినిమా సక్సెస్ అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సకల గుణాభి రామ సినిమా నిరాశ పరిచింది. గతంలో బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన వారు తమ అదృష్టం ను వెండి తెరపై పరీక్షించుకుని విఫలం అయ్యారు. ఇప్పుడు వీజే సన్నీ కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది.

బిగ్ బాస్ విజేతలుగా నిలిచినంత మాత్రాన ఇండస్ట్రీలో తోపులు అవ్వలేరు అని మరోసారి వీజే సన్నీ కి దక్కిన ఫలితం తో క్లారిటీ వచ్చేసింది. కనుక ప్రేక్షకులు ముందు ముందు బిగ్ బాస్ విన్నర్స్ ని తెలుగు ప్రేక్షకులు హీరోలుగా ఆధరించే పరిస్థితి లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.