శ్యామ్ సింగ రాయ్ మూడవ హీరోయిన్ గా ‘వి’ బ్యూటీ

0

నాని హీరోగా ట్యాక్సీవాలా ఫేం రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కథానుసారం నాని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే నానికి జోడిగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మూడవ హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అధితి రావు హైదరి మరియు నివేధా థామస్ ల్లో ఒక్కరిని ఈ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది.

వీరిద్దరు కూడా నానితో గతంలో రొమాన్స్ చేసిన వారే అవ్వడంతో ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం అన్నట్లుగా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. నాని 25వ సినిమా ‘వి’ లో వీరిద్దరు నటించిన విషయం తెల్సిందే. ఇద్దరిలో ఒకరిని అతి త్వరలోనే ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకు సినిమాను పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పునర్జన్మ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ట్యాక్సీవాలాను విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రాహుల్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా నానితో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.