శ్రియ – సమంత – రమ్యకృష్ణ ఇంకా రాఘవేంద్ర రావు

0

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్.. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అనూహ్యంగా ఆయన నిర్మాతగా.. రచయితగా మరియు నటుడిగా బిజీ అయ్యారు. ఎనిమిది పదుల వయసుకు దగ్గరగా ఉన్న ఆయన ఇప్పుడు నటుడిగా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఒకప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు ఇష్టపడని రాఘవేంద్ర రావు ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాల్లో మరియు బుల్లి తెరపై కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనార్థన మహర్షి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక విభిన్నమైన సినిమాలో రాఘవేంద్ర రావు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న జనార్థన మహర్షి ఇప్పటికే సమంత.. శ్రియ.. రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో సినిమా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తుది దశ చర్చలు జరుగుతున్నాయి. ముగ్గురు హీరోయిన్స్ తో పాటు ఒక కొత్త అమ్మాయి కూడా కనిపించబోతుంది.

ఈ నలుగురితో రాఘవేంద్ర రావు కూడా కీలక పాత్రలో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. రాఘవేంద్ర రావు మరో వైపు పెళ్లిసందD సినిమా నిర్మాణ పనుల్లో ఉన్నాడు. వెబ్ సిరీస్ ల వైపు కూడా దర్శకేంద్రుడు ఆసక్తిగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వయసులో రాఘవేంద్రరావు సినిమాలు ఆయన అభిమానులకు ఆనందం కలిగిస్తున్నాయి.