నేచురల్ స్టార్ లో అలాంటి గుణం ఉందా?

0

నేచురల్ స్టార్ నానీని సన్నిహితంగా చూసిన వారు ఒకటే మాట చెబుతారు. అతడు చాలా డౌన్ టు ఎర్త్. అనవసర హడవాడి చేయరు. స్టార్ పవర్ చూపించేందుకు ఆసక్తిని కనబరచరు!! అన్నది అందరూ చెబుతుంటారు.

ఇప్పుడు `వి`లో నటించిన కోస్టార్ అదితీరావ్ హైదరీ నానీపై షాకిచ్చే కామెంట్లే చేశారు. ఒకరకంగా అతడికి అదిరే కాంప్లిమెంట్ ఇచ్చింది తను. “నాని అద్భుతమైన వ్యక్తి. గొప్ప సహచర నటుడు. అసలు ఒక స్టార్ అనే ఇది చూపించడు. సౌమ్యంగా ఉంటాడు. తనలో అది నాకు బాగా నచ్చింది. మళ్లీ మళ్లీ తనతో నటిస్తాను“ అని అదితీ తెలిపింది. సినిమాలపై పిచ్చితో అంకితభావంతో పని చేస్తాడని నానీకి కాంప్లిమెంట్ ఇచ్చేసింది.

అంతా బాగానే ఉంది కానీ `సమ్మోహనం` కోస్టార్ సుధీర్ బాబు `వి`లోనూ నటించారు కదా.. ఆయన గురించి ఏమీ చెప్పలేదేం? అప్పట్లో అతడు రిజర్వ్ డ్ అని ఓ మాట అంది కానీ మరీ నేచురల్ స్టార్ ని పొగిడేసినంతగా పొగిడేయలేదు. అన్నట్టు మణిరత్నం తన ప్రతి సినిమాలోనూ అవకాశం ఇస్తే అస్సలు వదిలిపెట్టదట. ఇంతకుముందు నవాబ్ లో నటించింది. ఇప్పుడు మణి సర్ తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ లోనూ అవకాశం మిస్సయ్యింది ఎందుకనో. ఇందులో త్రిష- ఐశ్వర్యా రాయ్- ఐశ్వర్య లక్ష్మి- శోభిత ధూళిపాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు మణిరత్నం.