గూఢచారి సీక్వెల్ కోసమేనా ఈ లుక్కు

0

క్షణం.. ఎవరు వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన శేష్.. గూఢచారి తో మరో లెవల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ సక్సెస్ తో అతడి రేంజు కూడా పెరిగింది. ప్రస్తుతం అతడు క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు.

ఓవైపు మహేష్ నిర్మిస్తున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటే బ్లాక్ బస్టర్ మూవీ గూఢచారి సీక్వెల్ కోసం కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే గూఢచారి సీక్వెల్ కోసం అభిమనులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తుంటే శేష్ మాత్రం ఆ మూవీకి సంబంధించిన ఏ అప్ డేట్ చెప్పడం లేదు.

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తీరిక సమయాన్ని పర్ఫెక్ట్ గానే సద్వినియోగం చేసుకున్నాడని తాజాగా ఇన్ స్టాలో రివీల్ చేసిన ఫోటోలు చెబుతున్నాయి. శేష్ మునుపటి కంటే ఫిట్ గా మారాడు. కండలు పెంచి అవసరం మేర ఫ్యాట్ ని తొలగించి స్మార్ట్ గా మేకోవర్ అయ్యాడు. లుక్కు సంథింగ్ హాట్ గా ఉంది. ఇంతకీ ఈ లుక్కు మేజర్ కోసమా? లేక గూఢచారి సీక్వెల్ కోసమా? అన్నది శేష్ రివీల్ చేయాల్సి ఉంది. అన్నట్టు మేజర్ కి సంబంధంచిన ప్రమోషన్ ని ఘట్టమనేని బ్యానర్ ఇంకా ప్రారంభించలేదేమిటో? ముంబై ఎటాక్స్ లో పలువురిని కాపాడిన వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా మేజర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే.