మనవరాళ్ల కోరిక తీర్చిన చిరు.. వీడియో వైరల్

0

కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. సినీ పరిశ్రమ అయితే మూతపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా టాలీవుడ్ అగ్రహీరోలు మాత్రం బయటకు రాకుండా సినిమా షూటింగ్ లకు దూరంగానే ఉంటున్నారు.

తాజాగా ఆదివారం సెలవు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి సేదతీరారు. వారికిష్టమైనది వండి పెట్టి ముచ్చట తీర్చుకున్నారు.

మెగా స్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి ఈ ఆదివారం పూట కే.ఎఫ్.సీ చికెన్ తయారు చేశారు. ఈ మధ్యనే దోశలు వేసి తన పాక పోషణను చాటిన చిరంజీవి తాజాగా తన మనవరాళ్లతో కలిసి కే.ఎఫ్.సీ చికెన్ తయారు చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనవరాళ్లు నివ్రితి సంహితలతో కలిసి కెఎఫ్సి చికెన్ తయారు చేసిన వీడియోని పోస్ట్ చేశారు. ‘రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా..’ అంటూ చిరు ఈ వీడియోని షేర్ చేశారు.

కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ను తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు చిరంజీవి కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మనవరాళ్లతో ఆహ్లాదంగా గడిపారు. ఈ వీడియోలో నివ్రితి సంహితలు బోర్ కొడుతుంది.. కెఎఫ్సి చికెన్ తినాలని ఉంది అని సంహిత అనగా.. బయట పరిస్థితులేమీ బాగోలేదు.. ఇంట్లోనే తయారు చేసుకుందాం.. అని చిరు చెప్పారు. మనవరాళ్లు సహాయం చేయగా.. చిరంజీవి అన్నీ రెడీ చేసి కేఎఫ్సీ చికెన్ తయారు చేశారు.మనవరాళ్లకే కాదు.. ఫ్యాన్స్ కూడా చిరు పాకశాస్త్రం గురించి తెలిసేలా చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.