ఆర్ఆర్ఆర్ స్టార్ ‘సూపర్ హీరో’ మూవీ

0

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన ఒక సూపర్ హీరో మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిల్మ్ 50 ఏళ్లలోకి ఎంటర్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేసింది. హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరో తరహా సినిమాను అజయ్ దేవగన్ తో చేసేందుకు రెడీ అయ్యింది. భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నారట. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు కూడా మొదలు అయ్యాయి అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అజయ్ దేవగన్ మొదటి సారి యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో వెళ్లడి చేసే అవకాశం ఉంది. ఈ కరోనా సమయంలో స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందబోతున్న ఈ చిత్రం కేవలం ఒక్క పార్ట్ గా మాత్రమే కాకుండా పలు పార్ట్ లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. క్రిష్ మూవీ తరహాలోనే పార్ట్ పార్ట్ లుగా విడుదల చేయబోతున్నారట. హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరో సినిమాల రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాతో యశ్ రాజ్ ఫిల్మ్ స్థాయిని చాటి చెప్పాలని భావిస్తున్నారట.