బాల్కనీలో మకాం పెట్టిన నాగ్ బ్యూటీ…!

0

సుమంత్ నటించిన ‘మళ్ళీరావా’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది సీరియల్ నటి ఆకాంక్ష సింగ్. ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న ఆకాంక్ష సింగ్.. రెండో సినిమాకే ‘కింగ్’ నాగార్జున సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున – నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవదాస్’ సినిమాలో ఆకాంక్ష నాగ్ కి జోడీగా కనిపించింది. తెలుగులో నటించిన రెండు సినిమాలలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. అయినప్పటికీ ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే శాండిల్ వుడ్ లో అవకాశం దక్కించుకొని కిచ్చ సుదీప్ సరసన ‘పైల్వాన్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా తెలుగు – తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ‘క్లాప్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే వివాహం చేసుకున్న ఆకాంక్ష సింగ్.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరో ఆసక్తికరమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ముందుకొచ్చింది ఆకాంక్ష. ”నేను ఎల్లప్పుడూ హాయిగా ఉండే కార్నర్స్ లో బాల్కనీలలో టీ తాగడాన్ని ఆస్వాదిస్తాను” అని పోస్ట్ పెట్టింది. దీనికి బాల్కనీలో పరుపు వేసుకొని కూర్చుని టీ తాగుతున్న ఓ ఫోటోను జత చేసింది. అయితే ఇది ఒక ఫ్యూటన్ బ్రాండ్ కి పెయిడ్ ప్రమోషన్ అని తెలుస్తోంది. అందుకే ‘ఈ ఫ్యూటన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. నేను కోరుకున్న చోట దీన్ని ఉంచగలను’ అని కామెంట్ పెట్టింది. ఈ ఫొటోకు నెటిజన్స్ లైక్స్ కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా తొడలు కనిపించేలా అమ్మడు ధరించిన డ్రెస్ గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు చూసైనా మళ్ళీ ఆకాంక్షకు ఆఫర్స్ వెల్లువలా వస్తాయేమో చూడాలి.