అఖిల్ 5 కథకు చరణ్ కు సంబంధం!

0

అక్కినేని అఖిల్ నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇంకా పూర్తి కాకుండానే 5వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రకటించాడు. ఇటీవలే పవన్ తో మూవీ చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి నుండి ప్రకటన వచ్చింది. ఈ గ్యాప్ లో అఖిల్ తో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయమై చాలా చర్చ జరిగింది. రామ్ చరణ్ తో ఈయన సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. కథ కూడా చెప్పి చరణ్ ను ఒప్పించాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం మరియు ఇతరత్ర కారణాల వల్ల సూరి కథ నచ్చినా కూడా చరణ్ చేయలేక పోతున్నాడు.

చరణ్ కొన్ని కారణాల వల్ల చేయలేక పోతున్న ఆ ప్రాజెక్ట్ ను అఖిల్ తో చేసేందుకు సురేందర్ రెడ్డి రెడీ అయ్యాడనే సమాచారం అందుతోంది. అఖిల్ కు ఈ కథ బాగా సూట్ అవుతుంది అలాగే అతడి కెరీర్ కు ప్రస్తుతం ఇలాంటి సినిమా అవసరం అంటూ స్వయంగా చరణ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో సూరికి సలహా ఇచ్చాడట. అఖిల్ విషయంలో చరణ్ మొదటి నుండి కూడా శ్రద్దను కనబర్చుతూ ఉంటాడు.

అఖిల్ ను తమ్ముడిగా భావించే చరణ్ ఈ ప్రాజెక్ట్ ను వదిలేశాడని టాక్ వినిపిస్తుంది. తనకు బాగా నచ్చిన కథ అయినా ఈ సమయంలో అఖిల్ కు సక్సెస్ అవసరం కనుక చరణ్ త్యాగం చేశాడంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కాబోతున్న అఖిల్ 5 మూవీ ని ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యాన్స్ లో అనీల్ సుంకర నిర్మించబోతున్నాడు.