Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ కళ్లలో ‘పవర్’ ఉంది

ఆ కళ్లలో ‘పవర్’ ఉంది


పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడు.. ఏం చదువుతున్నాడు అనే విషయాలను తెలుసుకునేందుకు పవన్ అభిమానులు ఎప్పుడు నెట్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అకీరాకు సంబంధించినే ఏ చిన్న ఫొటో వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి పవన్ తనయుడు అకీరా ఫొటో వైరల్ అవుతోంది. ఈసారి అతడి కళ్లలో ఉన్న పవర్ గురించి చర్చ జరుగుతోంది.

అకీరాకు అభిమాన నటుడు అడవి శేషు అనే విషయం తెల్సిందే. గతంలో పలు సార్లు రేణు దేశాయ్ కూడా అకీరాకు శేషు అంటే చాలా అభిమానం అంటూ పేర్కొంది. ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో గతంలోనే చక్కర్లు కొట్టాయి. మళ్లీ ఈసారి కూడా వీరిద్దరి ఫొటో విభిన్నంగా ఉండి అందరిని ఆకట్టుకుంటుంది. ఇద్దరు కూడా మాస్క్ లు పెట్టుకుని తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో అకీరా బ్లర్ గా కనిపించినా కూడా పెద్ద ఎత్తున అతడి కళ్ల గురించి అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్లలో ఉన్న పవర్ అకీరా కళ్లలో కూడా కనిపిస్తుందని అంటున్నారు. తండ్రి కొడుకులను ఒక్క చోట పెట్టి ఫొటోలతో నెట్టింట అభిమానులు సందడి చేస్తున్నారు.