6.4 హైట్.. 16 ఏజ్ .. జూనియర్ పవర్ స్టార్ రెడీ!

0

హీరో అవ్వాలి లేదా అవ్వొద్దు! అనేది ఎవరో నిర్ణయించేది కాదు. అది ఫేట్.. టైమ్ డిసైడ్ చేయాలి. అది కలిసొస్తే ఏమైనా అవ్వొచ్చు. జూనియర్ పవర్ స్టార్ అకీరానందన్ విషయంలో ఇలాంటి మిరాకిల్ ఏదో జరగబోతోందా? అంటే అవుననే పవన్ కల్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.

అకీరా చూస్తుండగానే ఎదిగేస్తున్నాడు. అతడి వివరాలు పరిశీలిస్తే అంతకంతకు ఫ్యాన్స్ లో ఎగ్జయిట్ మెంట్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. 6.4 హైట్.. 16 ఏజ్ .. జూనియర్ పవర్ స్టార్ రెడీ! అంటూ ఉల్లాసంతో ఉన్నారంతా. అకీరా 2004లో జన్మించాడు. ఇప్పటికే టీనేజీలో అడుగుపెట్టాడు. నూనూగు మీసాల ప్రేమకథలకు సూటబుల్ ఈ కుర్రాడు అన్నంత ఎదిగాడు.

ముఖ్యంగా అతడి హైట్ గురించి అభిమానుల్లో ఎక్కువగా చర్చ సాగుతుంటుంది. 6.4 అడుగుల ఎత్తుతో టాలీవుడ్ లోనే ఒడ్డు పొడుగు ఉన్న హీరోల్లో అకీరా ట్రెండ్ సెట్ చేయబోతున్నాడన్న చర్చా ఉంది. రానా.. వరుణ్ తేజ్ .. ప్రభాస్ కంటే అకీరా రెండు ఇంచిలు ఎక్కువే. ఇక అకీరాకు దర్శకహీరో అడివి శేష్ క్లోజ్ ఫ్రెండ్. ఆ ఇద్దరి మధ్యా స్నేహం నిరంతరం అభిమానుల్లో హాట్ టాపిక్.

జూనియర్ పవర్ స్టార్ సినిమాల్లోకి వస్తారా రారా? అన్న ప్రశ్నకు రేణు దేశాయ్.. ఇంకా నిర్ణయించలేదనే చెప్పారు. తనకి ఇంకా టైమ్ ఉందనే అన్నారు. అంటే ఆ టైమ్ ఎప్పుడైనా రావొచ్చు. ఒకవేళ అడివి శేష్ లాంటి దర్శకుడే బరిలో దిగి తనని సడెన్ గా వెండితెరకు పరిచయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న గుసగుసలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.