మెగాస్టార్ బర్త్ డే .. మెగా హీరోలు శుభాకాంక్షలు

0

ప్రతిసారీ బర్త్ డే వేరు.. ఈసారి వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున చిరంజీవి కూడా ఈ సంవత్సరం వేడుకలను సాధా సీదా ఎఫైర్ గా ఉంచాలని అభిమానులను కోరారు. మహమ్మారి సమయంలో తన పుట్టినరోజును బైక్ ర్యాలీలతో జరుపుకోవద్దని.. కేకులు కట్ చేయాలంటే కోవిడ్ నియమాలు పాటించాలని అభిమానులను కోరారు మెగాస్టార్ చిరంజీవి. అయితే అభిమానులు బాస్ ఆజ్ఞను శిరసా వహించి అన్ని నియమాలు పాటిస్తూనే బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. తమ వేడుకలను డిజిటల్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు.

“మెగాస్టార్ అభిమానులుగా మహమ్మారి సమయంలో మనం క్రమశిక్షణతో ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా మాకు ర్యాలీలు ఉండవు. రక్తం దానం చేయడం.. బదులుగా చెట్లు నాటడం వంటి సామాజిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా మేం ఒక వారం ముందే వేడుకలను ప్రారంభించాము. ఈ సమూహ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పది మందికి మించకూడదు” అని ఓ అభిమాని అన్నారు. చెట్లను నాటేటప్పుడు కూడా సామాజిక దూర చర్యలను అనుసరిస్తున్నట్లు శివ అనే మెగాభిమాన సంఘం నాయకుడు పేర్కొన్నాడు.

దేశవ్యాప్తంగా వంద మంది ప్రముఖులు మెగాస్టార్ పుట్టినరోజు కోసం కామన్ డీపీ చిత్రాన్ని ప్రారంభించారు. ప్లాస్మా దానం ఇప్పుడు అవసరం. అందుకే మేము దాని గురించి అవగాహన పెంచుతున్నాము”అని వేరొక మెగాభిమాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మా అభిమాన తారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనేక వీడియోలను చేశారు. ఈ సందర్భంగా స్వతంత్రంగా కొన్ని పాటలు కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేయడం ఆసక్తికరం.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలంతా ఇప్పటికే మెగాస్టార్ కి ప్రత్యేకించి బర్త్ డే విషెస్ అందించారు. రామ్ చరణ్.. బన్ని.. శిరీష్.. వరుణ్ తేజ్.. సాయి తేజ్ .. నిహారిక .. వీళ్లంతా మెగా బర్త్ డే రోజున వినాయక చవితి కాబట్టి నేరుగానే ఆయనను విష్ చేస్తున్నారని తెలిసింది.

“బాస్ చేసిన సినిమాలు అతన్ని మెగా స్టార్ గా నిలిపాయి. అతను ప్రేమ .. కరుణను చూపే విధానం శ్రద్ధ వహించే విధానం .. అతని కుటుంబాన్ని నిర్వహించే విధానం.. సమాజం పట్ల తనకున్న శ్రద్ధను చూపించే విధానం.. నాకు న్యూమెరో యునో మెగా స్టార్ గా చూపిస్తోంది“ అంటూ సాయి తేజ్ ట్వీట్ చేశారు. పెదనాన్నతో బుల్లి వరుణ్ తేజ్ ఫోటో.. మావయ్యతో బన్ని ఫోటో సోషల్ మీడియాల్లో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటున్నాయి.

అల్లు శిరీష్ తన డెనిమ్స్ షర్ట్ పై మెగాస్టార్ ఫోటోని ప్రదర్శించడం ఆసక్తికరం. ఎప్పటికప్పుడు నా అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు.. ధన్యవాదాలు. నా కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి పదాలు సరిపోవు.. నేను వాటి నుండి తప్పుకుంటాను. BDMegastarChiranjeevi.. అంటూ అభిమానం వ్యక్తపరిచారు. `TeluguNow.com` తరపున లెజెండ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు.