Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ 4: నిజానికి క‌రోనా టెన్ష‌న్ కంటే ఈ టెన్ష‌నే ఎక్కువ

బిగ్ బాస్ 4: నిజానికి క‌రోనా టెన్ష‌న్ కంటే ఈ టెన్ష‌నే ఎక్కువ


కూచుంటే టెన్షన్ .. నించుంటే టెన్షన్.. నిద్దట్లో గుండె నొప్పి టెన్షన్.. అంతగా స్ట్రెస్ అయిపోతున్నారు జనం. నిత్యం టీవీలు ఆన్ చేస్తే కరోనా వార్తలు గుండె నొప్పిని ఆటోమెటిగ్గానే రప్పిస్తున్నాయి. అందుకని చాలామంది టీవీలు కట్టేసి ఇండ్లలో ఆవిరి పట్టుకునే పనిలో ఉన్నారు. మరి ఇలాంటి టెన్షన్ నడుమ అన్ని టెన్షన్లు వదిలించేందుకు వినోదం పంచేందుకు బిగ్ బాస్ సీజన్ 4ని తేవాలనేది స్టార్ మా తాపత్రయం. మునుపటిలా ఎక్కువ నస లేకుండా ఈసారి డిజైన్ చేయాలని ప్లాన్. కానీ అది సక్సెసవుతుందా? అంటే…

కరోనా టెన్షన్స్ నిర్వాహకులపై ఓ రేంజులోనే ఉంది. ఇంట్లో ఒక సభ్యుడికి కరోనా పాజిటివ్ అని తేలినా అందరికీ టెన్షనే. అందుకే వీళ్లందరినీ షో ప్రారంభానికి ముందే చాలా జాగ్రత్తగా గృహనిర్భంధంలో ఉంచారు. కూచున్నా.. లేచి నిలబడినా.. షాపుకు వెళ్లినా.. షాపింగుకి వెళ్లినా వెంటే బాడీగార్డులా వదిలి పెట్టడం లేదట. నిజానికి కరోనా టెన్షన్ కంటే ఈ టెన్షనే ఎక్కువగా ఉందట.

ఇక ఇప్పటికే 16 మందిని ఎంపిక చేసి వారిని స్వీయనిర్భంధంలో ఓచోట ఉంచారు. రెండ్రోజుల క్రితం అందరినీ లాక్ చేసేసారట. ఇక వాళ్లు బయటకు వెళ్లేందుకే ఆస్కారం లేదని తెలుస్తోంది. 16మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. రకరకాలుగా టెస్టులు చేసి నిర్భంధంలో ఉంచారట.

బిగ్బాస్ తెలుగు సీజన్ 4 షో ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ పరీక్షలు పూర్తయ్యాయట. ఆగస్టు 30 నుంచి షో మొదలవుతోంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని రెండోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల్లో ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయాయి.