జిల్ జిల్ జాకీ హొయలు ఏ రేంజులో…!

0

జాక్విలిన్ ఫెర్నాండెజ్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అసలే మర్చిపోలేరు ఈ శ్రీలంకన్ బ్యూటీని. `సాహో` సినిమా అంతా ఒకెత్తు అనుకుంటే చివరిలో వచ్చే జాకీ స్పెషల్ సాంగ్ ఒకెత్తుగా నిలిచింది అంటే అమ్మడు ఏ రేంజులో హొయలు పోయిందో ఊహించవచ్చు.

బ్యాడ్ బోయ్ .. అంటూ సాగే ఆ పాట విజువల్స్ ఇప్పటికీ యువతరం కళ్లలో మెదులుతాయంటే జాకీ అంతగా ప్రభావం చూపించింది కాబట్టే. బ్లాక్ బికినీలో జిగిబిగి అందాలతో యూత్ మత్తెక్కిపోయే ఫోజులతో అదరగొట్టింది. ఇకపోతే సాహో తర్వాత అంత క్రేజీ ఆఫర్ ఏదీ కనిపించడం లేదు ఎందుకనో.

జాక్విలిన్ కి 2020 ఏమాత్రం కలిసొచ్చినట్టు లేదు. సల్మాన్ భాయ్ తో దబాంగ్ టూర్ లో కనిపించినా.. ఆ తర్వాత లాక్ డౌన్ లో సల్మాన్ తోనే రెండు వారాల పాటు ఫామ్ హౌస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలినా కొత్తగా ఆఫర్లు అయితే ఏవీ రాలేదు.

సింహబలుడు జాన్అబ్రహాం సరసన ఎటాక్ అనే చిత్రంలో నటిస్తోంది. అది గాక నెట్ ఫ్లిక్స్ లో మిసెస్ సీరియల్ కిల్లర్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇవన్నీ పాత ప్రాజెక్టులే. కొత్తగా ఏదీ ప్రకటించనే లేదు ఎందుకనో. తాజాగా ఇన్ స్టా ఫోటోలో జాకీ తన స్నేహితురాలు అమండాతో కలిసి అదిరిపోయే ఫోజిచ్చింది. అమండా సెర్నీ పాశ్చాత్య మోడల్ కం నటి.