కింగ్ గాళా.. బాండ్ గాళా.. ఎవరీ బికినీ గాళ్?

0

అందానికి అందం .. సెక్సప్పీల్ ఎలివేట్ అయితే రంగుల ప్రపంచంలో అలాంటి మోడల్స్ కి ఉండే క్రేజు వేరు. నాగార్జున `మన్మధుడు 2` లో తనదైన హాట్ అప్పియరెన్స్ తో కుర్రకారు మతులు చెడగొట్టింది టాప్ మోడల్ అక్షర గౌడ. ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో ఓ రేంజులో చెలరేగుతోంది. ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్ తో అక్షర తాజాగా దుమారం రేపుతోంది. తెల్లని వృత్తాకార గోళం అంచున కూర్చుని నల్ల బికినీ లో సిమసిమలు ప్రదర్శిస్తున్న అక్షర గౌడ తన పొడుగు కాళ్ల సొగసును ఆవిష్కరిస్తోంది.

అక్షర మోడల్ కం నటి. ర్యాంప్ నుంచి వచ్చి రఫ్ఫాడించే ప్రయత్నాల్లో ఉంది. అయితే మన్మథుడు 2 తర్వాత తెలుగులో సరైన అవకాశాలేవీ రాలేదు. అడపా దడపా ఇరుగు పొరుగు సినిమాల్లో సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాల్లో ఈ అమ్మడి ఫోటోషూట్లు చూస్తుంటే బాండ్ గాళ్ కి ఏమాత్రం తగ్గడం లేదని అర్థమవుతోంది.

బికినీ షోస్.. థై షోస్ తో దుమారం రేపుతున్న అక్షరకు గూఢచారి సీక్వెల్ లో ఛాన్సిచ్చేందుకు అడివి శేష్ సిద్ధంగా ఉన్నాడో లేదో తెలీదు కానీ.. ఆ పేరును పరిశీలిస్తే తప్పేమీ కాదని నెటిజనులు సెలవిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడి గురించి నెటిజనుల్లో ఆరా ఆ రేంజులోనే ఉంది. కింగ్ గాళా.. బాండ్ గాళా.. ఎవరీ బికినీ గాళ్? అంటూ తెగ వెతికేస్తున్నారు లేటెస్ట్ ఫోటో షూట్ కోసం.