సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం నటవారసుల మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ మాఫియాపైనా.. ఇన్ సైడర్స్ .. ఔట్ సైడర్స్ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక బయటి ప్రతిభను తొక్కేస్తున్న బాలీవుడ్ ముఖ్యులందరిపైనా సుశాంత్ సింగ్ అభిమానులు కక్ష కట్టారు.
బాలీవుడ్ లో స్వపక్షపాతానికి వ్యతిరేకంగా తొలి పంచ్ పడింది. నటవారసురాలు ఆలియా భట్ పై కోపంతో `సడక్ -2` సినిమా ట్రైలర్ కి డిస్ లైక్ ల మోత మోగింది. ప్రపంచంలో అత్యధికంగా నచ్చని మూడవ ట్రైలర్ గా రికార్డులకెక్కింది. ఈ చిత్రానికి ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వం కోపాగ్నిలో దహించుకుపోవడానికి అసలు కారణం. సంజయ్ దత్ – అలియా భట్ .. ఆదిత్య రాయ్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా.. భట్స్ పై కోపాన్ని సుశాంత్ ఫ్యాన్స్ అలా డిస్ లైక్స్ రూపంలో వెల్లగక్కారు.
డిస్ లైక్స్ లో నంబర్ వన్ ఏది? అన్నది ఆరా తీస్తే.. జస్టిన్ బీబర్ పాట `బేబీ` కోసం 11.6 మిలియన్ల మంది అయిష్ఠతను వ్యక్తం చేశారు. ఆ తరవాత సడాక్ -2 కు 9.04 మిలియన్ డిస్ లైక్ లు వచ్చాయి. యూట్యూబ్ పోస్ట్ చేసిన ఓ వీడియోకు అత్యధికంగా 18.2 మిలియన్ డిస్ లైక్ లు వచ్చాయి.
ఆగస్టు 12 న విడుదలైన సడక్ -2 ట్రైలర్ భారతదేశంలో అత్యధికులు ఇష్టపడని యూట్యూబ్ వీడియోగా రికార్డులకెక్కింది. ట్రైలర్ ఓ సెక్షన్ ని మెప్పించినా `స్వపక్షపాతం` పర్యవసానమిదన్న కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి. ఇన్ సైడర్స్ నటించే సినిమాలకు ఇకపై ఇలాంటి థ్రెట్ తప్పదని అర్థమవుతోంది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
