ప్రభాస్ బాటలోనే బన్ని డబుల్ ట్రీట్ ప్లాన్

0

డార్లింగ్ ప్రభాస్ కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్ తోనే తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 11 ఆగస్టు 2022న ఆదిపురుష్ 3డి రిలీజవుతుండగా.. అంతకు మూడు నెలల ముందే సలార్ రిలీజవుతుంది. 2022 ఏప్రిల్ 14న సలార్ రిలీజవుతుందని తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే బాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన సినిమాల రిలీజ్ తేదీల్ని వెంటవెంటనే ప్రకటించనున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పా అనే సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం త్వరలో పూర్తి కానుంది. తదుపరి కొరటాల శివతో కలిసి బన్ని ఓ సినిమా చేయనున్నారు. ఇంతకుముందే ప్రీలుక్ రిలీజ్ చేశారు. దానికి హైప్ బాగా వచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ తేదీ ప్రకటించేందుకు బన్ని సిద్దంగా ఉన్నాడని తాజాగా ఫిలింనగర్ లో గుసగుసలు మొదలయ్యాయి.

బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తేదీల్ని ప్రకటించడం ద్వారా తన దర్శకుల్ని అలెర్ట్ చేస్తాడని చెబుతున్నారు. సుక్కూ తెరకెక్కిస్తున్న పుష్ప ఆగస్టు 13 న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఆ తర్వాత తక్కువ గ్యాప్ తోనే తర్వాతి సినిమాని రిలీజ్ చేయాలని బన్ని భావిస్తున్నారట. ఆ మేరకు ప్రచారం సాగిపోతోంది. అయితే అల్లు అర్జున్ స్వయంగా ఈ రెండు చిత్రాల గురించి మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిలీజ్ మ్యాటర్ లో అభిమానులకు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా క్లారిటీ ఇస్తే బావుంటుంది.