సూపర్ స్టైలిష్ లుక్ తో బన్ని ట్రీట్

0

ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ అనే పిలిచాం. కానీ అది పాతబడిపోయింది. ఇకపై బన్నీని సూపర్ స్టైలిష్ స్టార్ అని పిలవాలేమో! తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థ వేడుకలో బన్ని కనిపించిన తీరు చూస్తుంటే `సూపర్ స్టైలిష్` అన్న వ్యాఖ్యలు ఆ కాంపౌండ్ లో వినిపించాయి. బన్ని టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించాడు. సన్నగా ట్రిమ్ చేసిన గడ్డం మెలి తిప్పిన మీసకట్టు.. గిరజాల జుత్తుతో స్పెషల్ గా కనిపించడం ఒకెత్తు అయితే ఎంతో స్లిమ్ లుక్ కి మారిపోయి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి.

ఇన్నాళ్లు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో భార్య స్నేహారెడ్డితో కలిసి జాగింగ్ రన్నింగ్ అంటూ చాలానే శ్రమించాడు బన్ని. వేకువ ఝామున కేబీఆర్ వద్ద సిన్సియర్ గా జాగింగ్ చేశాడు. దాని రిజల్ట్ ఇదిగో ఇలా కనిపిస్తోందన్నమాట. ఇక ఈ లుక్ పుష్ప కోసమేనా? అన్నది బన్నీనే చెప్పాలి. పుష్ప ఎలానూ పాన్ ఇండియా లెవల్ కాబట్టి అందుకు తగ్గట్టే లుక్ పరంగానూ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడని అర్థమవుతోంది.

పుష్ప లోనూ బన్ని 6 ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. అటు హిందీ మార్కెట్ ని టార్గెట్ చేశారు కాబట్టి అక్కడ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని బన్ని చాలా చాలా మార్పులు తెస్తున్నాడనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్తూరు యాసతో రూపొందిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 జనవరి నుంచి తదుపరి షెడ్యూల్ తెరకెక్కనుంది.