Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మ ఆ మాటతో నందమూరి ఫ్యాన్స్ రిలాక్స్

వర్మ ఆ మాటతో నందమూరి ఫ్యాన్స్ రిలాక్స్


రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో వరుసగా వివాదాస్పద టాపిక్స్ ను తీసుకుని వాటిపై డిజిటల్ మూవీ చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆమద్య పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే మూవీని తీసి వర్మ నానా రచ్చ చేశాడు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత పై కూడా వర్మ సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో వర్మ నందమూరి హీరో బాలకృష్ణ గురించి ఒక సినిమా తీయబోతున్నాడని వార్తలు వచ్చాయి. 2004 సంవత్సరంలో జరిగిన ఒక ఘటనపై జనాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటికి వర్మ సమాధానం చెప్పేలా సినిమా తీస్తాడని ప్రచారం జరిగింది.

వర్మ అనుకుంటే దేన్ని అయినా తీస్తాడు. కనుక బాలయ్య కు సంబంధించిన ఆ విషయంపై కూడా సినిమా తీస్తాడేమో అని అంతా అనుకున్నారు. ఆ రోజు రాత్రి బెల్లంకొండ సురేష్ బుల్లెట్ గాయం ఇంకా పలు విషయాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. బాలయ్యపై అప్పట్లో పలు పుకార్లుషికార్లు చేశాయి. దాంతో ఇప్పుడు మళ్లీ వాటిని తెరపైకి తీసుకు వస్తే బాలయ్య విషయమై రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉందని నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ బాలకృష్ణ ఆ సంఘటనకు సంబంధించిన సినిమా విషయమై స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.