మీ బట్టలిప్పి నగ్నంగా అద్దంలో చూస్కోండన్న పూరి

0

ప్రపంచం నిన్నొదిలేస్తే ఒంటరితనం .. ప్రపంచాన్ని నువ్వొదిలేస్తే ఏకాంతం..! సరైన మాట చెప్పాడు పూరి. అతడికి ప్రపంచాన్ని వదిలేయడమే ఎక్కువ అలవాటు. అందుకే ఎంతో అనుభవంతో చెప్పాడు మరి. ఇక పూరి స్క్రిప్టు వర్క్ లో ఉంటే మాత్రం పూర్తి ఏకాంతంగా ఉంటాడు. మాంచి బీచ్ పరిసరాల్లో తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. ఫైనల్ ఔట్ పుట్ తో సత్తా చూపెడుతుంటాడు. ఒంటరితనం తో ఏడుపొస్తుంది.. లైఫ్ లో పైకి రాలేరు అని చెబుతూనే రకరకాల ఆల్టర్నేట్ ప్లాన్ గురించి పూరి చెప్పాడు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు అప్పుడు తీసుకోగలం అని అన్నాడు.

ఇక పూరి మరో మాట కూడా చెప్పాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేయండి.. కాసేపు తలుపేసేయండి.. కాసేపు మీ బట్టలిప్పి అవతల పడేయండి. వాడిని చూడండి. వాడి పొట్ట రూపం అన్నీ చూడండి. అంతా అర్థమైపోతుంది. పందిలా తినకూడదు.. కసరత్తు చేయండి అని చెబుతున్నట్టు ఉంటుంది. ఆ అద్దంలో కనిపించే వాడిని అడగండి.. ఇప్పటివరకూ ఏం పీకావ్ అని! మీకున్న అన్ని డౌట్లు అడగండి. వాడి విజన్ ఏంటి? రాబోవు పదేళ్ల కోసం వాడి దగ్గర ఏం ప్లాన్ ఉందో అడగండి. అవేవీ లేవు అనుకుంటే వాడి ముఖంపై ఉమ్మేయండి. సాల్వ్ చేయలేక మట్టి బుర్ర అయితే ..

లోన్లీనెస్ మంచిది కాదు. కానీ ఎలోన్ నెస్ అనేది స్పిరిచ్యువల్ .. గేమ్ ఛేంజర్.. అంటూ అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు పూరి. నిజమే చాలామంది అంతిమంగా సాధించాల్సిన లక్ష్యంపై గురి పెట్టడంలో తడబాటు ఉంటుంది. అలాంటివారికి స్ఫూర్తి నిచ్చే ఎన్నో విషయాలు చెప్పారు పూరి. ఇక పూరి కనెక్ట్స్ లో ఈ వాయిస్ చాట్ ఎంతో ఆకట్టుకుంటోంది. పూరి మార్క్ డైలాగులు స్ఫూర్తి నింపేవిగా వినబడుతున్నాయ్. కావాలంటే మీరూ వినండి…