స్విమ్మింగ్ పూల్ లో అందాల సాగర కన్య

0

తెలుగు ప్రేక్షకులకు పవన్ నటించిన బద్రి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తెలుగులో మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత నాని సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో ఎప్పుడు కూడా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది. ఈమద్య కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ పోస్ట్ లతో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఈ ఫొటోను షేర్ చేసి వావ్ అనిపించింది.

అయిదు పదుల వయసుకు దగ్గరకు వచ్చినా కూడా ఈ అమ్మడు ఇంకా పాతికేళ్ల పడుచు పిల్ల మాదిరిగా బికినీ అందాలను ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది. ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో సాగర కన్య మాదిరిగా అందాలను ఆరబోస్తూ నెటిజన్స్ కు మత్తెక్కించడంలో సక్సెస్ అయ్యింది. ఈ అమ్మడు గతంలో కూడా ఫొటోలను షేర్ చేసింది. కాని హాట్ సాగర కన్యగా ఈసారి మరింత అందంగా సెక్సీగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అమ్మడు కాస్త గ్యాప్ తర్వాత ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో వైపు ఈమె వెబ్ సిరీస్ ల్లో కూడా నటించేందుకు ఈమె ఓకే చెప్పిందట. ఇంత అందంగా ఉంటే ఇంకా అవకాశాలు రాకుండా ఎలా ఉంటాయి. ఆరు పదుల వయసు వచ్చిన తర్వాత కూడా హాట్ గానే నటిస్తుందేమో ఈమె అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.