ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక..!

0

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ తో ఛలోమంటూ దూసుకుపోయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’.. నితిన్ సరసన ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి వరుస హిట్లు వస్తున్నా సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. రష్మిక ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా.. రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేసినంత ఇచ్చే ప్రాజెక్ట్స్ కు మాత్రమే సైన్ చేస్తోందని టాక్ నడుస్తోంది.

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు తమిళ్ లో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ సినిమాలో నటించింది. ఇది ఆమెకు తమిల్ డెబ్యూ మూవీ. అలానే కన్నడలో ‘పొగరు’ సినిమాలో నటించింది రష్మిక. ఇదే క్రమంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో యువ హీరో శర్వానంద్ కి జోడీగా కనిపించనుంది. తాజాగా #Akhil5 లో అక్కినేని అఖిల్ సరసన రష్మిక నటించనుందని తెలుస్తోంది. సురేందర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.