అభిమానులకు మహేష్ హీరోయిన్ రిక్వెస్ట్

0

మహేష్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆరు సంవత్సరాల క్రితం ఆర్జే అన్ మోల్ ను వివాహం చేసుకన్న అమృతరావు ఇప్పటికి కూడా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత మొదటి సారి సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో ముచ్చటించిన అమృత రావు తన బాబు పుట్టుకతో మొత్తం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఆనందకరమైన సమయంలో అభిమానులకు ఒక రిక్వెస్ట్ పెట్టింది.

ఏడేళ్ల పాటు అన్ మోన్ తో ప్రేమలో ఉన్న తాను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. ఈ 11 ఏళ్ల రిలేషన్ షిప్ ఎంతో స్వీట్ గా సాగింది. మా ఈ జీవితంకు సంపూర్ణమైన అర్థంను తెచ్చి పెట్టిన బాబుకు మంచి పేరును సూచించాల్సిందిగా అమృత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అభిమానులు సూచించిన పేర్లలో మంచి పేరును తాను బాబుకు పెడతానంటూ పేర్కొంది. అమృత అడగడమే ఆలస్యం వందల మంది పేర్లను సూచించారు. వేలాది మంది ఆమెకు పేర్లను సూచించే అవకాశం కనిపిస్తుంది. అందులో ఏ పేరును అమృత ఎంపిక చేస్తుందో చూడాలి.