‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి అదిరిపోయే ‘అమృత’ సాంగ్…!

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ‘అమృత’ లిరికల్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ విరహగీతంగా ఉంటుందని తెలుపుతూ ఇప్పటికే తేజ్ వెల్లడించాడు.

‘బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు సిమ్మ చీకటైపోయిందే.. సెల్లు ఫోను కంపెనోడికే సిమ్ కార్డే బ్లాకై పోయిందే.. రూటు చూపే గూగులమ్మనే ఇంటి రూటునే మరచిపోయిందే.. రైటు టైము చెప్పే వాచ్ కె బ్యాడ్ టైమే స్టార్టైపోయిందే..’ అంటూ సాగిన ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆకట్టుకునే బాణీలను అందించాడు. ‘అగ్గిపుల్లనే నేను మెల్లగా కాల్చుతుంటే.. సొంత కొంపనే ఫుల్లుగా పెట్టుకున్నాదే.. పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే.. ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోలేక మందు తాగుతా.. ఒట్టేసి చెప్తున్నా అమృతా నువ్వెళ్ళిపోతే ఒంటరిపోతా.. ‘ అంటూ అమృతా తన జీవితంలో నుండి వెళ్లిపోయిన సందర్భంలో హీరో పాడుకుంటున్నాడు.

‘చెంప మీద ఒక్కటిద్దామంటే చెయ్యే రావట్లేదే.. ఫెవికోల్ కన్నా గట్టిగా ఫిక్స్ అయ్యి చుక్కలు చూపిస్తావే.. ‘ అంటూ రైటర్ కాసర్ల శ్యామ్ అందించిన క్యాచీ లిరిక్స్ ని సింగర్ నకాష్ అజీజ్ ఆలపించారు. విరహగీతం అనగానే సాడ్ ఫీల్ తో ఉండే బీట్ కాకుండా యూత్ పాడుకుంటూ ఎంజాయ్ చేసే సాంగ్ గా థమన్ అందించిన మ్యూజిక్ కొత్త ఫీల్ కలిగిస్తోంది. ఇక ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వెంకట్ సి దిలీప్ కెమెరామెన్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. మొత్తం మీద అమృత ప్రేమలో పడిన విరాట్.. బ్రేకప్ తర్వాత పడుకునే ఈ పాత ఆకట్టుకునేలా ఉంది. వరుసగా చార్ట్ బస్టర్ పాటల్ని అందిస్తున్న థమన్ మరోసారి అలాంటి ఆల్బమ్ నే ఇచ్చాడనే నమ్మకం కలుగుతోంది.