బాబోయ్.. బుట్ట బొమ్మ బర్త్ డే కేక్ ఎంత పెద్దదో!

0

బాబోయ్.. బుట్ట బొమ్మ బర్త్ డే కేక్ ఎంత పెద్దదో! .. అంత కేక్ ఒక్కత్తే తినడం కష్టమేనేమో!! ఇలా ఉన్నాయి కుర్రకారు డౌట్లు. పైగా కేక్ కట్ చేస్తూ సోలోగా అలా ఫోజిచ్చిన తీరు చూస్తుంటే .. చుట్టూ ఎవరూ లేరా? డార్లింగ్ ప్రభాస్ ఏమయ్యాడు? రాధే శ్యామ్ బృందం ఏమైంది? అన్న డౌట్లు పుట్టుకొచ్చాయ్.

అయితే నిన్నంతా రాధేశ్యామ్ టీమ్ తోనే ఉంది పూజా. టీమ్ నుంచి విషెస్ అందుకుంది. అలాగే తనకు దూరంగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ పూజా హెగ్డే కి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది. అల వైకుంఠపురములో తర్వాత పూజా నటిస్తున్న రెండు సినిమాలు మళ్లీ అంత బంపర్ హిట్టెక్కుతాయా? అన్న ఫ్యాన్స్ గుసగుసలు వినిపించాయి.

ఈసారి పూజా బర్త్ డే వేడుక ఇటలీలో జరిగింది. తన బర్త్ డే కేక్ ఫోటోని పూజా అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేసింది. కేక్ సైజ్ రెగ్యులర్ కంటే బిగ్ సైజ్ లో స్పైసీగా నోరూరించేస్తోంది. పుట్టినరోజు వేడుకల నుండి ఫోటోలను పంచుకుంటూ.. అమితమైన ప్రేమ శుభాకాంక్షలు అందుకున్నందుకు ధన్యవాదాలు“ అని తెలిపింది. పూజా తన హోటల్ గదిలో తిరామిసు (ఇటలీ బ్రాండ్) కేక్ కట్ చేసింది. తిరామిసు కేక్ కాఫీ రుచిగల ఇటాలియన్ కేక్. ఇటలీలో ‘రాధే శ్యామ్’ షూటింగ్ స్వింగులో ఉంది. “పని… ప్రేమ … నవ్వు.. శుభాకాంక్షలు .. తిరామిసు కేక్ .. నా “ బర్ట్డే ”లో ఇవన్నీ ఉన్నాయి… ధన్యవాదాలు. నేను చాలా ఆశీర్వాదం పొందాను ” అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.