ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్న మామా-అల్లుడు…!

0

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు. నేడు(అక్టోబర్ 15) తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి ‘అమృత’ అనే సాంగ్ రిలీజ్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ తేజ్. ‘సోలో’గా ఉన్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయ్. నీ ‘సోలో’ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ తన మామయ్య బర్త్ డే విషెస్ కి ధన్యవాదాలు తెలిపాడు. ”ఇదే ఎవరైనా కోరుకునే బెస్ట్ బర్ డే గిఫ్ట్. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు మామ.. లవ్ వ్యూ సో మచ్. మీ ఆశీర్వాదం తప్ప మరేమీ అడగలేను. థాంక్యూ సో మచ్ మామా” అని తేజ్ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగాసుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తేజ్ ‘ప్రస్థానం’ దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసాడు. దీంతో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. అంతేకాకుండా గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో తేజ్ ‘భగవద్గీత సాక్షిగా’ అనే ప్రాజెక్ట్ లైన్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి.