గోవాలో జబర్దస్త్ బ్యూటీ వేడుకలు

0

జబర్దస్త్ యాంకర్ అనసూయ రెగ్యులర్ గా కుటుంబ సభ్యులతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే కరోనా కారణంగా చాలా నెలలుగా మొత్తం ఇంట్లోనే ఉండి పోయారు. ఎట్టకేలకు భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా గోవా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా అక్కడ సందడి చేశారు. అనసూయ సోషల్ మీడియాలో ఆ ఫొటో లు షేర్ చేసింది. యల్లో బనియన్ వేసి ఒక షార్ట్ వేసిన అనసూయ బీచ్ ఒడ్డున ఉన్న రిసార్ట్ లో తన కుటుంబ సభ్యులతో సందడి చేసింది. భరద్వాజ్ పుట్టిన రోజు వేడుకలను అనసూయ వైభవంగా నిర్వహించింది.

బుల్లి తెరపై మరియు వెండి తెరపై తెగ హడావుడి చేస్తున్న అనసూయ ఇద్దరు పిల్లలు అయినా కూడా అమ్మాయిలకు ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ పోజ్ చేస్తుంది. అందంతో పాటు మంచి ప్రతిభ ఉండటంతో అనసూయ సినిమాల్లో కూడా రాణిస్తుంది. రంగమ్మత్త పాత్ర ఈమె సినీ కెరీర్ ను టర్న్ చేసింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా కూడా ఆఫర్లు వస్తున్న ఈ అమ్మడు మరిన్ని మంచి పాత్రలు చేస్తుందని ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కుటుంబ సభ్యులకు సరైన ప్రాముఖ్యత ఇస్తూనే సినిమాలు మరియు బుల్లి తెరలపై బిజి బిజీగా గడిపే అనసూయను చూసి అంతా కష్టపడే తత్వంను నేర్చుకోవాల్సిందే అంటున్నారు.