మరో స్టార్ హీరోయిన్ కూతురు తెరగేట్రం

0

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు వెలుగు వెలిగిన మాజీ మిస్ యూనివర్శ్ సుష్మిత సేన్ తన పెంపుడు కూతురు రెనీ సేన్ ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సిద్దం అయ్యింది. 21 ఏళ్ల రేని సేన్ మొదటి సినిమా ప్రారంభం అయ్యింది. సుత్తబాజీ అనే సినిమాతో రెనీ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. కోమల్ చబ్రియా ఈ సినిమాలో రెనీకి అమ్మగా నటించబోతుండగా రాహుల్ వోహ్రా నాన్న పాత్రలో కనిపించబోతున్నారు. తల్లిదండ్రి కూతురు మద్య సాగే కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

డిజిటల్ రిలీజ్ కోసం రూపొందిస్తున్న ఈ సినిమాను నిన్నటి నుండి షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం అంతా కూడా వెబ్ సిరీస్ లు డిజిటల్ మూవీస్ పై దృష్టి పెడుతున్న కారణంగా సుష్మిత సేన్ తన కూతురును కూడా ఓటీటీ ద్వారా తెరగేట్రం చేయిస్తుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ వారసులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు సుష్మిత తన కూతురును ప్రేక్షకులకు పరిచయం చేబోతుంది. ఒక వైపు నెపొటిజం గురించి కుప్పలు తెప్పలుగా విమర్శలు వస్తున్నా కూడా స్టార్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ పిల్లలను పరిచయం చేస్తూనే ఉన్నారు.

ఆర్య తో ఓటీటీలో ఇటీవలే సుష్మిత సేన్ ఎంటర్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకోవడంతో ఇప్పుడు కూతురు ను కూడా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సుత్తబాజీ సక్సెస్ అయితే ఆమెకు ఫీచర్ ఫిల్మ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారసురాలు ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది చూడాలి.