Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైట్ డ్రెస్సులో ‘లిల్లీ’ పువ్వులా మెరుస్తుందిగా ఈ యాంకరమ్మ..!!

వైట్ డ్రెస్సులో ‘లిల్లీ’ పువ్వులా మెరుస్తుందిగా ఈ యాంకరమ్మ..!!


తెలుగు టీవీ ప్రేక్షకులకు యాంకర్ అనసూయ అంటే ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేజి మీద తన అందంతో.. యాంకరింగ్ తో.. డాన్సులతో తెలుగు కుర్రకారును వలలో వేసుకుంటోంది. ఇక ప్రోగ్రాంలతో పాటు సినిమాలలో వయ్యారాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం స్టార్ యాంకర్ అనిపించుకుంటుంది. అనసూయ టీవీ ప్రేక్షకులు మెచ్చే యాంకర్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు కోరుకునే యాక్టర్ తను. ఓవైపు యాంకరింగ్ మరోవైపు సినిమాలు రెండింటిని సమానంగా బాలన్స్ చేసుకుంటుంది. ఇక ఈటీవీ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ.. అదే షో ద్వారా తెలుగు ప్రజలకు బాగా దగ్గరైంది.

ఇక ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన గ్లామర్ తో ఎలాంటి వారినైనా బుట్టలో పడేయగల అనసూయ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవే. తన గురించి తన టీవీ షోల విశేషాలతో పాటు తన సినిమాల విషయాలు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో తన అందాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేసింది. మరి గ్లామర్ ప్రియులు ఊరుకుంటారా.. అలా అనసూయ పోస్ట్ చేసిందో లేదో ఇలా లైక్స్.. షేర్స్ చేస్తూనే ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ వైట్ కలర్ లో కొత్తగా డిజైన్ చేసిన డ్రెస్ లో ఫోటోషూట్ చేసిన పిక్స్ షేర్ చేసింది. ఆ ఫోటోలలో అనసూయను చూస్తూ.. వైట్ డ్రెస్ లో లిల్లీ ఫ్లవర్ లా ఉందంటూ ఫ్యాన్స్.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ పలు సినిమాలతో బిజీగా ఉందట.