Templates by BIGtheme NET
Home >> Cinema News >> పూనమ్ బజ్వా ఎంత చేసినా ఫలితం జీరో

పూనమ్ బజ్వా ఎంత చేసినా ఫలితం జీరో


తెలుగు- తమిళంతో పాటు మలయాళంలోనూ కెరీర్ సాగిస్తోంది పూనమ్ బజ్వా. ఇంతకుముందు నాగార్జున సరసన బాస్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సక్సెస్ లేక టాలీవుడ్ లో ఆశించిన మైలేజ్ దక్కలేదు. ఆ క్రమంలోనే మలయాళంలో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని అక్కడే సెటిలైపోయింది. అయితే అక్కడా ఇటీవల కెరీర్ అంతంత మాత్రమే. 2019లో ఎన్టీఆర్ బయోపిక్ లో అతిథి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత తమిళంలో ఓ చిత్రం చేసినా అంత గుర్తింపు రాలేదు. అందుకే ఇటీవల ఇతర నాయికల్లానే సోషల్ మీడియాల వెల్లువలో ప్రచారం హీటెక్కిస్తోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోలతో హీటెక్కిస్తోంది బజ్వా.

తాజాగా ఈ భామ సింపుల్ పింక్ డ్రెస్ లో థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ ఎక్స్ పోజ్ చేసిన ఫోటో జోరుగా వైరల్ అవుతోంది. టూమచ్ గా చెలరేగాల్సిన అవసరం లేకుండానే హాట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకుంటోంది. పూనమ్ ఎంతగా ట్రై చేసినా టాలీవుడ్ లో అయితే ఆఫర్లు లేవ్. ప్రస్తుతం మలయాళంలోనూ కెరీర్ ఖాళీ. తమిళంలో 2019లో జీవీ ప్రకాష్ సరసన కుప్పతు రాజా అనే చిత్రంలో నటించినా ఆ తరవాత ఆఫర్లు అయితే రాలేదు. ఇన్ స్టా హాట్ ఫోటోషూట్లు అయినా అవకాశాలు తెస్తాయేమో చూడాలి.