రాయలసీమ పొలిటీషియన్ కూతురుతో యాంకర్ ప్రదీప్ పెళ్లి?

0

యాంకర్ ప్రదీప్ కు బుల్లి తెర ద్వారానే టాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగా క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఈయన పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈయన ప్రేమ విషయం పెళ్లి విషయం పదే పదే మీడియాలో పుకార్లుగా షికారు చేస్తూనే ఉంది. ఆ మద్య పెళ్లి చూపులు అనే రియాల్టీ షో నిర్వహించి అందులో విన్నర్ అయిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రకటించారు. కాని ప్రదీప్ పెళ్లి చూపులు విన్నర్ ను పెళ్లి చేసుకోలేదు. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వెంటనే ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం మళ్లీ మొదలైంది. ఎట్టకేలకు ప్రదీప్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందని తెలుస్తోంది.

బుల్లి తెర వర్గాలు.. మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ మాచిరాజు రాబోయే మూడు నాలుగు నెలల్లో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. రాయలసీమకు చెందిన ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి కూతురుతో ప్రదీప్ వివాహం జరుగబోతుంది. ఆ విషయమై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయి ప్రస్తుతం కుటుంబంకు చెందిన వ్యాపారాలను చూసుకుంటుందట.

ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం నిశ్చితార్థం మరియు పెళ్లికి సంబంధించిన తేదీలను కూడా నిర్ణయించుకోవడం జరిగిందట. అతి త్వరలోనే ప్రదీప్ నుండి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలకు రెడీగా ఉంది. థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. హీరోగా మొదటి సినిమా మరియు కొత్త జీవితం రెండు కూడా 2021 ఆరంభంలో జరిగే అవకాశాలు ఉన్నాయట.