ఒకరోజు ముందే ‘ఆహా’ సర్ప్రైజ్

0

రాజ్ తరుణ్ హీరోగా హెబ్బా పటేల్ మరియు మాళవిక నాయర్ హీరోయిన్స్ గా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను విడుదల చేయాలనుకున్న సమయంలో లాక్ డౌన్ విధించారు. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన తర్వాత లాక్ డౌన్ విధించడంతో థియేటర్ల ఓపెన్ కోసం ఆరు నెలలుగా వెయిట్ చేశారు. థియేటర్లు ఇంకా కూడా పునః ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో చేసేది లేక ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ 2వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని ఈ సినిమా ను సర్ ప్రైజింగ్ గా ఒక్క రోజు ముందే విడుదల చేయబోతున్నారు.

వరుసగా విజయాలు అందించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈమద్య కాలంలో కాస్త నిరాశ పర్చుతూ వచ్చాడు. దాంతో ఈ సినిమా అయినా ఆయన కెరీర్ కు బూస్టింగ్ ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజ్ తరుణ్.. హెబ్బా పటేల్ కాంబోకు మంచి క్రేజ్ ఉండటంతో పాటు విజయ్ కుమార్ కొండ కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్ ను తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్నాడు. కనుక ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొడతాడని అంతా భావిస్తున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుంది.