మగాడు సత్తా చాటడమెలాగో చెప్పిన పూరి

0

ఏదైనా విషయంపై నిక్కచ్ఛిగా మాట్లాడేస్తూ పూరి మ్యూజింగ్స్ ఇటీవల విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. వాయిస్ మెసేజ్ లో ఎన్నో గొప్ప విషయాల్ని పూరి జగన్నాథ్ వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇక తాజా వాయిస్ లో మగాడు సంపాదన గురించి చాలా ఆసక్తికర విషయాల్నే చెప్పాడు.

మగాడు అంటే సంపాదనతో సత్తా చాటాలని అన్న పూరి మొబై నంబర్ ని బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చగలగాలని అన్నారు. అమ్మాయిల్ని మగాళ్లు ఇష్టపడినట్టు అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడరని కూడా అన్నారు. అంతేనా.. సంపాదించే మగాడు సత్తా చాటే వాడిని ఇష్టపడతారని అందగాడు ఆరడుగుల ఆజానుబాహుడు అయినంత మాత్రాన అమ్మాయిలు ఇష్టపడడం లేదని ఇందులో చాలా క్లారిటీగా ఉంటున్నారని అన్నారు తనదైన శైలిలో. ప్రతి మగాడు తన బ్యాంక్ బ్యాలెన్స్ అతడి మొబైల్ నంబర్ అంత అయ్యేలా కష్టపడాలని అన్నారు.

మగాళ్లను ఎవరూ ఎత్తుకోరు.. ఎవరూ ముద్దుపెట్టుకోరు. సో స్వీట్ అని మన బుగ్గ పట్టుకుని ఎవరూ గిల్లరు. ఎందుకు.. అంటే సమాధానం లేదు. మగాడు ఏదైనా చేయాలి.. ఏదైనా తేవాలి.. ఏదైనా ఇవ్వాలి లేదా ఏమైనా అయిపోవాలి. ఏమీ చేయకుండా మనల్ని ఎవ్వరూ ఎత్తుకోరు. ముద్దు పెట్టుకోరని అన్నారు. అందుకే ఏదైనా చేయండి. ఖాళీగా ఉండొద్దని ఉపదేశించారు పూరి. ఎందుకూ పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నాడని సెటైర్ వేసేసారు తనదైన శైలిలో.

మొదటిసారి హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో మేడెక్కి పైనుంచి నగరాన్ని చూశారట. రాత్రి వెలుతురు లో ఎటు చూసినా భవంతులే కనిపించాయి. ఇవన్నీ మేధావులు తెలివైన వాళ్లే కట్టారా? అంటే కానాకాదు.. యావరేజ్ తెలివి తేటలు ఉన్నా ఎంతో హార్డ్ వర్క్ తో సాధించుకున్నవేననిపించిందట. తాను కూడా ఏదో ఒక రోజు ఇల్లు కట్టేద్దామని భావించానని తెలిపారు. వేల కోట్లు సంపాదించిన వాళ్లందరూ పుట్టికతోనే జీనియస్ లు కాదని.. లైఫ్ లో ఎంతో కష్ట పడ్డారని పూరి అన్నారు. వాళ్ల లానే మనమూ కష్ట పడదామని అన్నారు.