కెల్విన్ క్లెయిన్ కి సంతకం చేశావా రాశీ?

0

ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయాలంటే అందుకోసం ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. ఈ విషయంలో అందాల రాశీ ఖన్నా వంద శాతం పర్ఫక్ట్ అన్న సంగతి తెలిసిందే. నిరంతరం జిమ్ యోగా విషయంలో ఏమాత్రం రాజీకి రాదు. ఇటీవలి కాలంలో రాశీ మేకోవర్ అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి విధితమే. ఇక రాశీ ఖన్నా హైదరాబాద్ లోనే సెటిలై ఇక్కడే కొలీగ్స్ తో కలిసి జిమ్ కి వెళుతుంటారు.

ఇదిగో లేటెస్టుగా రాశీ జిమ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. జిమ్ కి వెళుతున్న రాశీ పర్ఫెక్ట్ డిజైనర్ స్పోర్ట్ లుక్ తో మతులు చెడగొడుతోంది. బాగా పరిశీలిస్తే ఆ డ్రెస్ ఏ బ్రాండ్? అంటే ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్. ఈ ఉత్పత్తికి ఇప్పటికే దిశా పటానీ ప్రచారం చేస్తున్న సంగతి విధితమే.

టాప్ టు బాటమ్ టాప్ లేపేసిన రాశీఖన్నా లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అందుకేగా ఏ ఇతర భామకు లేని క్రేజ్ ని రాశీ కంటిన్యూ చేస్తోంది. సక్సెస్ లేకపోయినా అవకాశాలకు కొదవేమీ లేకుండా ఎవరో ఒకరు సాయపడుతున్నారు. ఇండస్ట్రీ కమ్యూనికేషన్ విషయంలో ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో రాశీ కి ఉన్న స్ట్రాటజీనే వేరు! అంటూ యూత్ గుసగుసలాడేస్తున్నారు మరి. రాశీ నటించిన తమిళ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కోవిడ్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. `వరల్డ్ ఫేమస్ లవర్` నెగెటివ్ రిజల్ట్ కొంతవరకూ ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాలకు కమిటయ్యారని సమాచారం.