సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ పై దివ్యవాణి కామెంట్స్

0

తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటుపై సోమవారం తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన టీడీపీ మహిళా నేత దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

వివిధ రంగాల్లో ఉన్నట్లే సినీ రంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్లదే రాజ్యమని..రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని దివ్యవాణి ప్రశ్నించారు. పెద్ద హీరోలతో నటించకపోవడానికి ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి వివిధ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడ్డారని వివరించారు.

నా కూతురు చదువుతున్న హైదరాబాద్ లోని కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని దివ్యవాణి ఆరోపించారు.

డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమయంలో దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.