కేటీఆర్ తో యాంకర్ సుమ ఇంటర్వ్యూ.. ట్రోల్స్

0

బుల్లితెరపై పాపులర్ యాంకర్ సుమ కనకాల. ఆమె మాటల ప్రవాహానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు టీవీ చానెల్స్ లోనే ఈమె నంబర్ యాంకర్. అలాంటి సమక్కకు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ డిమాండ్ ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ సినీ సెలెబ్రెటీలను ఆకర్షించే పనిలో పడింది. ఈమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ఉండడంతో పార్టీలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.

గళగళ మాట్లాడుతూ యాంకరింగ్ చేసే సుమ తాజాగా మంత్రి కేటీఆర్ తో ఇంటర్వ్యూ చేసింది. ఈ విషయాన్ని సుమనే తాజాగా వెల్లడించింది. తన ఇన్ స్ట్రాగ్రాంలో మంత్రి కేటీఆర్ తో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ సర్ తో తాను సంభాషించడం ఆనందంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇన్ స్ట్రాగ్రామ్ లో కేటీఆర్ గురించి ఓ ఆసక్తికర మేసేజ్ పెట్టింది. ‘నేను షోలలో గడగడ ఆపకుండా మాట్లాడుతుంటా.. కానీ మీ (కేటీఆర్) నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది.. ప్రకటించడం.. అంకిత భావంతో పని చేయడం.. అమలు చేయడం.. మీ మార్గాలు.. సూపర్ సర్..’ అంటూ ఇన్ స్ట్రా పోస్టు పెట్టింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. కెటిఆర్ టిఆర్ఎస్ పాలనపై ఈ సందర్భంగా సుమ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

డిసెంబర్ 1 న జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేటిఆర్తో సుమా ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తోంది. అయితే తమకు పరిచయం లేనందున ఇలాంటి రాజకీయ ఇంటర్వ్యూలు చేయవద్దని చాలా మంది నెటిజన్లు సుమాను కోరారు.

జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందే టిఆర్ఎస్ను ప్రోత్సహించినందుకు కొందరు సుమను ట్రోల్ కూడా చేస్తున్నారు. అలాంటి ఇంటర్వ్యూలు చేస్తే ఆమె విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కొందరు సుమను హెచ్చరిస్తున్నారు. సుమ ఒక రాజకీయ నేతను ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి కానప్పటికీ టీఆర్ఎస్ కు సపోర్టుగా ఇంటర్వ్యూ చేసినందుకు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కెటిఆర్ తో సుమా ఇంటర్వ్యూ పూర్తి వీడియో ఇంకా విడుదల కాలేదు. అది విడుదలయ్యాక ఇంకా ఎన్ని విమర్శలు వస్తాయో చూడాలి మరి.