నారింజ బికినీలో మాల్దీవుల్ని షేక్ చేస్తున్న రకుల్

0

సమ్మర్ రాకముందే మాల్దీవుల్లో అగ్గి రాజుకుంటోంది. అందాల భామల వేడెక్కించే బికినీ యాక్ట్ తో బీచ్ లు షేక్ అవుతున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల సెలబ్రేషన్ కి సంబంధించిన ఒక్కో ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వరుస ఫోటో సిరీస్ తో రకుల్ అభిమానుల్ని హీటెక్కించేస్తోంది.

ఈ రెండ్రోజులుగా పంజాబీ బ్యూటీ రకుల్ తన కుటుంబంతో కలిసి బీచ్ సెలబ్రేషన్స్ లో ఫుల్ చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవిలో విహారానికి సంబంధించిన జ్ఞాపకాల్ని పోస్ట్ కార్డు సైజ్ ఫోటోలతో ఇన్ స్టాను నింపుతోంది. దీవిలో రకుల్ ప్రీత్ సింగ్ వారాంతపు ప్రణాళికలు ఓ రేంజులో ప్లాన్ చేసిందని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి.

అధునాతన ఈత దుస్తులలో ఇంతకుముందు ట్రీటిచ్చిన రకుల్ .. విటమిన్ డి మోతాదు గురించి ప్రస్థావించింది. నేటి ఉదయమే బీచ్ యోగా ఫోటోల్ని షేర్ చేసిన రకుల్ తాజాగా నారింజ రంగు బికినీలో తళతళలాడుతున్న ఫోటోతో మరోసారి హీట్ పెంచేసింది.
సూర్యాస్తమయం పూల్ సైడ్ ట్రీట్ ఇదని వెల్లడించింది.

రకుల్ ప్రస్తుతం వరుసగా రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. వీటిలో అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల అజయ్ దేవగన్ దర్శకత్వం వహించనున్న `మేడే` చిత్రానికి సంతకం చేసింది. అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహించి నిర్మించే థ్రిల్లర్-డ్రామాలో రకుల్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించనున్నారు.